Home South Zone Andhra Pradesh కడపలో రెచ్చిపోతున్న గల్ఫ్ మెడికల్ & ట్రావెల్ మాఫియా |

కడపలో రెచ్చిపోతున్న గల్ఫ్ మెడికల్ & ట్రావెల్ మాఫియా |

0

ఒక రోజుకు కొన్ని కోట్ల,లక్షల రూపాయలు వసూలు ఎటువంటి అనారోగ్యం లేకపోయినా మెడికల్ మాఫీయా ట్రావెల్స్ ఏజంట్లు కలసి దోచుకోవడం సర్వ సాధారణము అయ్యింది ..!!

రోజుకు మెడికల్ కోసం ఒక్క బెంగుళూరు కు 250 మంది వెళితే కేవలం మెడికల్ పాస్ అయ్యేది 18 మంది మాత్రమే మిగతావారికి ఎటువంటి అనారోగ్యం లేకపోయినా మెడికల్ మాఫీయా ట్రావెల్స్ ఏజంట్లు ఐక్యత తొ మెడికల్ అన్ఫిట్ చేస్తున్నారు …!!

మెడికల్ లో ఏమి ప్రాబ్లం వుందో పేపర్ ఇవ్వండి అంటే ఇవ్వరు మీ ట్రావెల్ ఏజెంట్లతొ మాట్లాడుకొండి అని వారి సమాధానం వుంటుంది..!!
బయట హాస్పిటల్ లో మెడికల్ చెక్ చేపించుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఆ వ్యక్తి లో కనిపించవు ..!!
గల్ఫ్ దేశాలు కేటాయించిన మెడికల్ హాస్పిటల్ లో చేయించుకుని అన్ఫిట్ అయిన వ్యక్తి అదే గల్ఫ్ దేశాలు కేటాయించిన మరొక హాస్పిటల్లో వెళితే ఒకరోజు తేడాతోనే మెడికల్ పాస్ అయిపోతారు ఇవి ఎలా సాధ్యమవుతున్నాయో అంతు పట్టని విషయం గా మిగిలిపోతోంది..!!

గల్ఫ్ వెళ్లేవారు మెడికల్ చేపించి పాస్ అయినట్లు తేలాలి అంటే అది ఒక లాటరీ పద్ధతి అయిపోయింది …ఒక్క మెడికల్ పేపర్ కోసం నానా తిప్పలు పడాల్సి వస్తుంది ..!!
ఒక ప్రవాసుడు ఒకటికి మూడుసార్లు మెడికల్ చేయించుకుంటే ఒక్కొక్క మెడికల్ కు 8 వేల 500 వందలు మరియు రాను పోను ప్రయాణ ఖర్చులు 12 వేలు అవుతుంది ఇలా మూడు నాలుగు సార్లు మెడికల్ హాస్పిటల్ తిరిగితే 48 వేలు అవుతుంది అప్పటికి మెడికల్ పాస్ అవుతారు అని గ్యారెంటీ ఉండదు ఎందుకంటే అది ట్రావెల్ ఏజెంట్ల కనుసన్నల్లో జరుగుతుంది …!! ఇవి తెలియని ప్రవాసులు ఇక ఏమీ చేయలేక ప్రవాస వ్యక్తులు సెట్టింగ్ మెడికల్ ను ఆశ్రయిస్తారు అందులో ట్రావెల్ ఏజెంట్లు ఇతర రాష్ట్రాల్లోని మెడికల్ సెంటర్లకు పంపించి పాస్ చేపిస్తాం అని 75 వేల నుండి ఒకటిన్నర లక్షల రూపాయల వరకు.

ఇంట్లో పనికి వెళుతున్నారా బయట కంపెనిలో వెళుతున్నారా అని ఆ వీసా లను బట్టి డబ్బులు డిమాండ్ చేస్తారు డబ్బులు సెట్టింగ్ కోసం ఎజెంట్లకు అందించిన వెంటనే ,అక్కడికి వెళ్లిన వెంటనే మెడికల్ పాస్ అయిపోతారు..!!
ఇలాంటివి చవి చూస్తున్న గల్ఫ్ దేశాలకు వెళ్ళే ప్రవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..!!
ఎక్కువ జీతం సంపాదించ వచ్చు అనే కారణం తో కువైట్, సౌది, ఖతార్, బెహరిన్, దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాలకు వెళ్ళే కొత్త వీసా పై వెళ్ళే వారికి ఆరోగ్యంగా వున్నట్లు ధ్రువపత్రము అవసరం గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారు దేశం లోని ఆయా రాష్టాలలో కొన్ని హాస్పిటల్ లో మాత్రమే మెడికల్ చేయాల్సి వుంటుంది.

గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ , గోవా, కేరళ లోని కేటాయించిన హాస్పిటల్ లో మాత్రమే మెడికల్ చేయాల్సి ఉంటుంది దాన్ని ఆసరాగా చేసుకొని కడప జిల్లాలోనీ ట్రావెల్ ఏజెంట్లు,బ్రోకర్లు మరియు ఇతర రాష్ట్రాల్లోని మెడికల్ హాస్పిటల్ లోని డాక్టర్ ల లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకొని మెడికల్ ఆన్ఫిట్ చేస్తూ ప్రవసులను మెడికల్ పాస్ చేయిస్తాము అని పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి లక్షలు కోట్లు దోచేస్తూనారు…!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా కడప జిల్లా ప్రవాస యువతకు ఎటువంటి అనారోగ్యం సమస్యలు లేకపోయినా మెడికల్ అన్ఫిట్ చేసి హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ వారి అవసరాన్ని బట్టి మెడికల్ మాఫీయా ఏజంట్లు మెడికల్ ఫిట్ (పాస్) అయినట్లు పేపర్ ఇవ్వడానికి ఒక్కో ప్రవసుడి నుండి 75 వేల నుండి ఒకటిన్నర లక్ష వరకు వసూలు చేస్తున్నారు దీని పై కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, కడప జిల్లా లోని పోలీసులు…

గల్ఫ్ మెడికల్ మాఫియా& ట్రావెల్ ఏజెంట్ల ఐక్యత తొ సాగుతున్న లక్షల కోట్ల రూపాయల దోపిడీని అరికట్టాల్సిందిగా గల్ఫ్ ప్రవాసులు కోరుతున్నారు
అలాగే మన ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో గల్ఫ్ మెడికల్ సెంటర్ ను కొత్తగా ఏర్పాటు చేయవలసిందిగా మెడికల్ మాఫియా దోపిడిని అరికట్ట వలసిందిగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని గల్ఫ్ NRI లు కోరుతున్నారు.

NO COMMENTS

Exit mobile version