Home South Zone Andhra Pradesh విద్యార్థులకు భద్రతపై అవగాహన సదస్సు

విద్యార్థులకు భద్రతపై అవగాహన సదస్సు

0
0

కర్నూలు :  కర్నూల్ జిల్లా…సైబర్ నేరాలు,  రహదారి భద్రత ,హెల్మెట్ వాడకం, మహిళల పై జరిగే నేరాల పై  విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు…మహిళ భద్రతకు పటిష్ట చర్యలు…మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన శక్తి యాప్, శక్తి వాట్సాప్ నంబర్ల పై , మహిళల పై జరిగే నేరాలు,  రహదారి భద్రత ,హెల్మెట్ వాడకం, సైబర్ నేరాల గురించి  పాఠశాలలు.

కళాశాల విద్యార్దులకు  జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ ల అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని  డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు  తెలిపారు. శక్తి టీం బృందాలు మహిళలకు, బాలికలకు పాఠశాల, కళాశాలలో విద్యార్థినిలకు శక్తి యాప్, గుడ్ టచ్ & బ్యాడ్ టచ్, పోక్సో చట్టాలు, ఈవ్ టీజింగ్ లపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ప్రేమ పేరుతో మోసాలు

మహిళలపై జరిగే నేరాల పై మరియు చట్టాల పై అవగాహన కల్పించారు.  ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలలో శక్తి టీం బృందాలు  జన సంచారం ఉన్న ప్రాంతాలతో పాటు, పలు పాఠశాలల్లో విద్యార్థులకు  డయల్  112, డయల్ 100,1098, 1930, శక్తి యాప్ ,  మహిళలు అత్యవసర సమయాల్లో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు శక్తి” వాట్సప్ 7993485111 నెంబర్ ను మహిళలు, చిన్నారుల భద్రత కోసం సేవ్ చేసుకోవాలన్నారు.ఎక్కడైనా గంజాయి ,  డ్రగ్స్, మాదక ద్రవ్యాల సేవించడం చూసినా  విక్రయాలు, వినియోగం గురించి సమాచారం తెలిస్తే ఈగల్  టోల్ ఫ్రీ నంబర్ 1972 కు అందించాలని సూచించారు.

NO COMMENTS