గ్రామ రెవిన్యూ అధికారుల సమస్యలు పరిష్కారం: డివిజన్ అధ్యక్షులు శేఖర్
చీరాల: గ్రామ రెవిన్యూ అధికారుల సమస్యలు పరిష్కారా నికి తన వంతు కృషి చేస్తానని చీరాల రెవిన్యూ డివిజన్ గ్రామ రెవిన్యూ అధికారులు సంఘం అధ్యక్షులు సీహెచ్. శేఖర్ అన్నారు.బుధవారం చీరాల రెవిన్యూ డివిజన్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘము ఎన్నికలు స్థానిక ఎన్జీవో భవనంలో జరిగాయి. జిల్లా వీఆర్వోల కన్వినర్ పి. తులసీరావు,ఎన్నికలు అధికారి పి. సుధీర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.చీరాల డివిజన్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘానికి అధ్యక్షునిగా సిహెచ్. శేఖర్ ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఎన్ వి. రామారావు,ఉపాధ్యక్షులు గా కె. మాణిక్యం, ఎన్. సురేష్,జనరల్ సెక్రటరీ గా షైక్ రఫీ,జాయింట్ సెక్రటరీ లు డి. ప్రకాష్, రాధమ్మ,ఆర్గనైజషన్ సెక్రటరీ గా అశోక్,మహిళా సెక్రటరీ గా జానకి,స్పోర్ట్స్ సెక్రటరీ గా సదానందరావు, ట్రెజరర్ గా ఎస్. గోపాల కృష్ణ లు ఎన్నిక అయ్యారు.అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు చీరాల రెవిన్యూ డివిజనల్ అధికారి టి. చంద్ర శేఖర్ నాయుడు ని మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందజేశారు. రెవిన్యూ డివిజనల్ అధికారి నూతన కార్యవర్గ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
#Narendra
