పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి పరీక్ష రుసుము చెల్లించలేకపోయిన విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.
2026 మార్చిలో జరగనున్న పరీక్షల కోసం తత్కాల్ పద్ధతిలో ఫీజు చెల్లించేందుకు షెడ్యూల్ విడుదల చేసినట్లు మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) యాదయ్య తెలిపారు. రూ.1000 అపరాధ రుసుముతో ఈ నెల 21 నుంచి 27వ వరకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
