Home South Zone Andhra Pradesh ప్రధాన కార్యదర్శులతో దిశా నిర్దేశం మంత్రి నారా లోకేష్ |

ప్రధాన కార్యదర్శులతో దిశా నిర్దేశం మంత్రి నారా లోకేష్ |

0

మనందరిదీ ఒకటే అజెండా కావాలి

వచ్చే ఎన్నికల్లో గెలిచి చరిత్ర తిరగరాయాలి
చంద్రబాబు గారు ఒక్కరే మన నాయకుడు
నాతో సహా మిగతావారంతా సైనికులే మున్ముందు మరింత స్పీడ్ పెంచుతాం
అందరం కలిసి పార్టీని బలోపేతం చేద్దాం
పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశంలో మంత్రి లోకేష్ దిశానిర్దేశం

ఉండవల్లి: పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శలుగా ఈ రోజు మనం ఇక్కడ కూర్చొన్నామంటే కారణం తెలుగుదేశం పార్టీ. మనందరిదీ సింగిల్ లైన్, సింగిల్ అజెండా కావాలి. పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు గారు ఒక్కరే మన నాయకుడు.

మిగతావారంతా సైనికులే. నేను కూడా తెలుగుదేశం పార్టీకి సైనికుడినే అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో నూతనంగా నియమించిన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు జోనల్ కోఆర్డినేటర్లతో మంత్రి లోకేష్ సమావేశం అయ్యారు. నూతనంగా ఎన్నికైన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ప్రతిఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలి. పార్టీనే నెం.1. సమస్యలు ఏమైనా ఉంటే బాధ్యత తీసుకుని పరిష్కారానికి కృషిచేయాలి. అందరికీ నేను అందబాటులో ఉంటాను. ఇంఛార్జ్ మంత్రులు, శాసనసభ్యులు, జోనల్ కోఆర్డినేటర్లతో సమన్వయం చేసుకోవాలి. ఆయా నియోజకవర్గాల్లో ప్రజాదర్బార్, కార్యకర్తల సమావేశాలు నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. జిల్లా స్థాయి నుంచి క్లస్టర్, యూనిట్, బూత్, అనుబంధ సంఘాలతో సహా అన్ని కమిటీలను పూర్తిచేయాలి. ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ లు, మండల అధ్యక్షులతో కేలండర్ ప్రకారం సమీక్షా సమావేశాలు నిర్వహించాలి.

*చరిత్ర తిరగరాయాల్సిన బాధ్యత మనపై ఉంది*

1999లో మాత్రమే మనం రెండోసారి గెలిచాం. ఆ చరిత్ర తిరగరాయాల్సిన బాధ్యత మనపై ఉంది. సొంతిల్లు కంటే కిరాయి ఇల్లుపై దృష్టి పెడుతున్నాం. దీనికి ఫుల్ స్టాప్ పడాలి. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. ఆయా నేతల పనితీరుపై మూడు నెలలకోసారి సమీక్షిస్తాం. ఇది స్టేట్ కమిటీకి కూడా వర్తిస్తుంది. మనం తీసుకునే 10 నిర్ణయాల్లో 3 తప్పులు ఉంటాయి. వాటిని సరిచేసుకుని ముందుకు వెళ్లాలి. మిమ్మల్ని నియమించింది చంద్రబాబు గారు. పార్టీ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి.

*ఉత్తమ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చాం*

పార్టీ అనేది వ్యవస్థ. వ్యక్తులపై ఆధారపడకూడదు. ప్రతిఒక్కరు సాంకేతికతపై కూడా అవగాహన పెంచుకోవాలి. మై టీడీపీ యాప్ ద్వారా డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని తూచా తప్పకుండా అమలుచేయాలి. ఉత్తమ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చాం. అందరినీ గౌరవిస్తాం. పనిచేసే వారిని గుర్తిస్తాం. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను అమలుచేస్తే అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించవచ్చు. ఇందుకు మంగళగిరి ఉదాహరణ. డీఆర్సీ సమావేశం నిర్వహించే ముందు ఇంఛార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకుని జిల్లాలో పాలనాపరమైన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లాలి.

*అందరం కలిసి పార్టీని బలోపేతం చేద్దాం*

మున్ముందు స్పీడ్ పెంచుతాం. పార్టీ కోసం ఫుల్ టైం కేటాయిస్తాను. అందరం కలిసి పార్టీని బలోపేతం చేద్దాం. పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుంది. చంద్రబాబునాయుడు గారు కూడా పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ప్రతి అంశాన్ని స్వయంగా పరిశీలిస్తున్నారు. కూటమి పార్టీలతోనూ సమన్వయం చేసుకోవాలి. నెలకోసారి కూటమి పార్టీ నేతలతో సమావేశం కావాలి. 15 ఏళ్ల పాటు కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాపైనా దృష్టిసారించాలి. వచ్చే ఏడాది సభ్యత్వ కార్యక్రమం చేపడతాం. అందుకు సిద్ధంగా ఉండాలి.

*తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత*

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత. 75 ఏళ్ల వయసులోనూ చంద్రబాబునాయుడు గారు కార్యకర్తలను స్వయంగా కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. జగన్ రెడ్డి ఏనాడూ కార్యకర్తలను పట్టించుకోలేదు. పరదాలు కట్టుకుని తిరిగారు. మనం అందరం కుటుంబ సభ్యులం. మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి. లేదా నేనైనా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి. ఒక్కసారి పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత తూచా తప్పకుండా పాటించాలి. పార్టీ కార్యాలయాల నిర్మాణం పై దృష్టి పెట్టాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో పాటు జోనల్ కోఆర్డినేటర్లు మంతెన సత్యనారాయణ రాజు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్, సుజయ్ కృష్ణ రంగారావు, దీపక్ రెడ్డి, కోవెలమూడి రవీంద్ర, వేపాడ చిరంజీవి రావు, మందలపు రవి, పెళ్లకూరు శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version