Home South Zone Telangana రేషన్ దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కార్పోరేటర్.|

రేషన్ దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కార్పోరేటర్.|

0

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : పారదర్శకత మరియు జవాబుతనాన్ని నిర్ధారించే క్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, సాజిద్ మరియు ఇతరులతో కలిసి అల్వాల్ ల్లోని రేషన్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్శన సమయంలో స్టాక్ రిజిస్టర్లు, తూకం వేసే పద్ధతులు, నిత్యవసర సరుకుల నాణ్యత మరియు లబ్ధిదారుల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.

కార్పొరేటర్ లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, సరైన తూకాలు వేయాలని, పరిశుభ్రత పాటించాలని, మరియు కార్డుదారులందరికీ నిరంతరాయంగా సేవలు అందించాలని, దుకాణం సిబ్బందిని ఆదేశించారు. గుర్తించిన ఏవైనా అవకతవకల పై హెచ్చరికలు జారీచేసి తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు.

#sidhumaroju

NO COMMENTS

Exit mobile version