Home South Zone Telangana మెదక్ గ్రామీణ యువతకు క్రీడల్లో ప్రోత్సాహం – సీఎం కప్ ర్యాలీ |

మెదక్ గ్రామీణ యువతకు క్రీడల్లో ప్రోత్సాహం – సీఎం కప్ ర్యాలీ |

0

మెదక్ జిల్లా గ్రామీణ యువత పల్లె స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి ధ్యాన్చంద్ చౌరస్తా వరకు ముఖ్యమంత్రి కప్ టార్చ్ ర్యాలీని వివిధ శాఖల జిల్లా అధికారులు తో కలిసి టార్చిని వెలిగించి జెండా ఊపి ప్రారంభించారు.కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మాట్లాడుతూ సి.యం కప్ టార్చ్ ర్యాలీ ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల యువతను క్రీడల వైపు ఆకర్షించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటేలా ప్రోత్సహించడమేనని తెలిపారు.

గత సంవత్సరం మాదిరిగానే  ఈ సంవత్సరం కూడా సీఎం కప్ ‌ క్రీడా కార్యక్రమాలు పటిష్టంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టామన్నారు.ఆసక్తి గల క్రీడాకారులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తెలంగాణకు సంబంధించి

స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించే దిశగా ‌ ముందుకు పోతుందని గుర్తు చేశారు.పల్లెలోని యువత,విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంపొందించుకోవాలని దీనివల్ల శారీరక దృఢత్వం తో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా లభిస్తుందన్నారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి సాధన చేసి జిల్లా లోనే కాక జాతీయ,అంతర్జాతీయ వేదికలపై కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ ర్యాలీలో వివిధ పాఠశాలలు,కళాశాలలకు చెందిన విద్యార్థులు, క్రీడాకారులు, ఎన్.సి.సి క్యాడెట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ ర్యాలీ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి ధ్యాన్చంద్ చౌరస్తా వరకు వరకు కొనసాగింది.

NO COMMENTS

Exit mobile version