కర్నూలు : కర్నూలు సిటీ :
రేపు ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కల తొలగింపు• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్• 15 జెసిబిలతో 2వ విడత స్వచ్ఛత పనులు• 3 డివిజన్లలో 100% ఖాళీ స్థలాల శుభ్రతకు ప్రణాళికనగరంలోని ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కల తొలగింపును మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా ఆదివారం రెండో విడతగా విస్తృత స్వచ్ఛత పనులు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో పారిశుద్ధ్య తనిఖీదారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు.
ఆదివారం ఉదయం 7 గంటల నుంచే ప్రత్యేక డ్రైవ్‌ను 4వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 7, 12, 14వ శానిటేషన్ డివిజన్ల పరిధిలోని మొత్తం 127 ఖాళీ స్థలాల్లో 15 జెసిబిల సహాయంతో వంద శాతం పిచ్చి మొక్కలను తొలగించాలని కమిషనర్ ఆదేశించారు.
మూడు శానిటేషన్ డివిజన్ల పరిధిలోని ఖాళీ స్థలాలన్నింటినీ శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని, అనంతరం ఇతర డివిజన్ల పరిధిలోని పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగ ప్రసాద్, కార్యదర్శి నాగరాజు, శానిటేషన్ సూపర్వైజర్ ఎం.శ్రీనివాసరావు, శానిటేషన్ ఇంస్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
