Home South Zone Andhra Pradesh కార్యకర్తలు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన గద్దె క్రాంతి కుమార్

కార్యకర్తలు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన గద్దె క్రాంతి కుమార్

0

కార్యకర్తలను ఆదుకునే పార్టీ తెలుగుదేశం*

కార్యకర్తను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన గద్దె క్రాంతికుమార్‌*

తెలుగుదేశం పార్టీ ఇన్ని దపాలు అధికారంలోకి వస్తుందంటే దానికి కారణం కార్యకర్త శ్రమేనని, అటువంటి కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతికుమార్‌ తెలిపారు.

శనివారం ఉదయం అయ్యప్ప నగర్ కిషోర్ ఆర్థోపెడిక్ హాస్పటల్ నందు చికిత్స పొందుతున్న 8వ డివిజన్ కి చెందిన టిడిపి కార్యకర్త రెడపొంగు జై హిందరావును టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ పరామర్శించారు. అనంతరం వైద్య ఖర్చు నిమిత్తం సొంత నిధుల నుంచి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.

ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ కార్యకర్తలు పార్టీ కోసం చేసిన సేవలను పార్టీ ఎప్పటికీ మరవదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇబ్బందుల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకుంటుందని చెప్పారు. వైకాపా నాయకత్వం మాత్రం కార్యకర్తలను రెచ్చగొట్టి, వారిని ఇబ్బందులకు గురిని జైల్ల పాలు చేస్తోందని విమర్శించారు. తమ పార్టీ ప్రజలకు మంచి చేసే స్పష్టమైన అభివృద్ధి ప్రణాళికతో ముందుకు సాగుతుందన్నారు. వైకాపా పార్టీ రెచ్చగొట్టే రాజకీయాలు, కుట్రలతోనే ముందుకు వెళ్తోందని ఆరోపించారు. తమ పార్టీ వైద్య సహాయం అవసరమైన కార్యకర్తలకు ఎన్టీఆర్‌ బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి ద్వారా సహకారం అందిస్తున్నామని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ వ్యక్తిగతంగా అండగా నిలుస్తున్నారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, కొత్తపల్లి రమేష్, మల్లెల రామకృష్ణ, మెరకనపల్లి నాగేశ్వరావు, బద్దురి వీరారెడ్డి, హయత్ ఖాన్ తదితరులు ఉన్నారు.

NO COMMENTS

Exit mobile version