Home South Zone Telangana ఆశా వర్కర్లతో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి చాయ్ పే చర్చ.|

ఆశా వర్కర్లతో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి చాయ్ పే చర్చ.|

0

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తన కార్యాలయంలో చాయ్ పే చర్చ కార్యక్రమము నిర్వహించారు.
అల్వాల్ మండలము ఆశా వర్కర్లతో తేనేటి విందు ఏర్పాటుచేసి వారి కి ఉన్న సమస్యలపై చర్చించారు. ఆశ వర్కర్లు పలు కార్పొరేటర్ కు విన్నవించారు .

ముఖ్యంగా సెంటర్స్ కూడా లేని ప్రదేశాలు ఉన్నాయని కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేక సరైన వసతులు లేవని, మూత్ర శాలలు కూడా లేవని వెల్లడించారు. బుధవారం శనివారం గర్భిణులకు కానీ పిల్లలకు గాని వ్యాక్షన్స్ వేయడానికి సరైన వసతులు లేవని పేర్కొన్నారు .

వారికి కావలసిన సదుపాయాల కోసం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పై అధికారుల కు విన్నవించే ప్రయత్నం చేస్తానని, శాంతి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు జ్యోతి, కోమలత ,చంద్రిక, భాగ్య, ప్రమీల, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

NO COMMENTS

Exit mobile version