గుంటూరు జీజీహెచ్‌లో పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న మానస యువతిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ శుక్రవారం పరామర్శించాను.
బాపట్ల: గుంటూరు జీజీహెచ్‌లో పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న యువతిని పరామర్శించాను. ఈ సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు గారు కూడా హాజరయ్యారు. ఈ ఘటనపై పోలీసుల వ్యవహార శైలిని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి, విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాను. బాధితురాలికి న్యాయం జరిగేలా మహిళా కమిషన్ అండగా నిలుస్తుంది.
బాపట్ల పట్టణ పోలీసులు ఒక వివాదంలో చిక్కుకున్నారు.చోరీ కేసులో మానస అనే ఒక బ్యూటీషియన్ ను పోలీసులు గత నెల 26వ తేదీన స్టేషన్ కు తీసుకువెళ్లి దాడి చేసి కొట్టారనే అభియోగాలు వినిపిస్తున్నాయి.గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మానసను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ శుక్రవారం పరామర్శించి ఘటన వివరాలు సేకరించడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. ఈ ఘటనపై శైలజ విచారణకు ఆదేశించారు.
#Narendra
