నేడు వడ్డే ఓబన్న జయంతి.
తొలి తరం స్వాతంత్ర్య సమరయోధులు తెల్లదోరల అక్రమ పన్నువస్సుల తిరుగుబాటు చేసిన ధీరో దత్తుడు తెలుగు ప్రజలు గర్వించదగిన ప్రముఖ తోలితరం స్వాతంత్ర సమరయోధుడు శ్రీ *వడ్డే ఓబన్న* గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు జరిగింది రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ రొంగల గోపి శ్రీనివాస్ గారి ఆదేశానుసారం ఈరోజు ఉదయం 10.30 గంటలకు జరిగింది ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం విజయ్ కుమార్ యాదవ్
రాష్ట్ర ఉపాధ్యక్షులు బలివాడ శివకుమార్ పట్నాయక్
జోన్ ఇంచార్జ్ తుల్లిమిల్లి రామకృష్ణ యాదవ్
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు గారు అధ్యక్షులు ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా సుబ్రహ్మణ్యం పాల్గొని ఈ కార్యక్రమంలో ముందుగా పూలమాల వేసే నివాళులర్పించడం జరిగింది
అనంతరం లాక వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ
ఈ రోజు జనవరి 11…
ఇది ఒక సాధారణ తేదీ కాదు…
ఇది రేనాటి నేల గర్వించాల్సిన రోజు…
స్వతంత్ర సమర వీరుడు వడ్డే ఓబన్న జన్మించిన పవిత్ర దినం.
సంచార జీవితం గడిపిన వడ్డెర కులంలో పుట్టి,
దేశ స్వేచ్ఛ కోసం నిలబడిన సింహం ఆయన.
రాయి మోసిన చేతులతోనే
బ్రిటీష్ సామ్రాజ్యాన్ని వణికించిన విప్లవం ఆయనది.
బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి
రేనాటి పాలెగాళ్లు అధికారాన్ని అప్పగించినప్పుడు,
ఆ తవర్జీ అనే అవమానకర ఒప్పందమే
ఈ నేలపై తిరుగుబాటుకు నిప్పు రాజేసింది.
ఆ నిప్పును అగ్నిపర్వతంగా మార్చినవాడు
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి,
ఆ అగ్నిపర్వతానికి సైన్యాధ్యక్షుడిగా
ప్రాణం పెట్టి పోరాడినవాడు
మన వడ్డే ఓబన్న!
భయం ఎరుగని వడ్డెర్లు…
వీర బోయలు…
అడవుల కుమారులు చెంచులు…
ఈ సంచార తెగలన్నిటిని ఒక సైన్యంగా మలిచిన వ్యూహకర్త ఓబన్న.
దట్టమైన నల్లమల అడవుల్లో,
కుంఫనీ సైన్యం అడుగు వేయలేకపోతే,
అది ఒబ్బన్న నాయకత్వమే!
బ్రిటిష్ సైన్యం ఊచకోతకు గురై,
ప్రాణాలు కాపాడుకోవడానికి ఉరుకులు పెట్టిందంటే,
అది మన వీరుడి పోరాట శక్తే!
నరసింహారెడ్డికి
కేవలం అనుచరుడు కాదు…
అతని కవచం…
అతని ఖడ్గం…
అతని ప్రాణ రక్షకుడు వడ్డే ఓబన్న.
తన నాయకుడిని,
అతని కుటుంబాన్ని కాపాడేందుకు
తన ప్రాణాలనే తృణప్రాయంగా భావించిన
త్యాగశీలి ఆయన.
చరిత్ర పుస్తకాల్లో ఒక పథకం ప్రకారం మనకు చాలా అన్యాయం జరిగింది ఒక వీరుణ్ని చరిత్రలో తక్కువ చేయడం
కేవలం వడ్డెర జాతికి చేసిన అన్యాయం కాదు బిసి బడుగు బలహీన వర్గాల సమాజానికే చేసిన ద్రోహం.
ప్రియతమ భారత ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో భారత స్వావలంబన లో భాగంగా అమృత్ మహోత్సవంలో మన ధైర్యాన్ని మన గర్వాన్ని ప్రపంచానికి చెప్తున్నాం. ఇది ఒక ఆరోగ్యకరమైన చైతన్యం. స్వావలంభనలో లో ఇటువంటి నిర్ణయాలు బడుగు, బలహీన వర్గాలకు గౌరవం తీసుకొచ్చే చరిత్రాత్మక నిర్ణయాలుగా నిలుస్తున్నాయి.
అందుకే ఈ రోజు,
మనం వడ్డే ఓబన్న జయంతిని
ఘనంగా జరుపుకుంటున్నాం.
ఆయన త్యాగాలను
భావి తరాలకు స్ఫూర్తిగా నిలపాలని
ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం అధికారికంగా ఓబన్న గారి జయంతి నిర్వహించుకుంటుంది.
• ఓబన్న చరిత్ర కాదు…
ఓబన్న పోరాటం!
• ఓబన్న వ్యక్తి కాదు…
ఓబన్న ఉద్యమం!
జోహార్ స్వతంత్ర సమర వీరా!
జోహార్ వడ్డే ఓబన్నా!
ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ
