పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బోయకొండ ఆలయ అధికారులపై వచ్చిన పలు ఫిర్యాదులకు సంబంధించి శనివారం విచారణ జరిగింది.
కొండపై ప్రస్తుత ఈవో ఏకాంబరం అవినీతి పనులు చేస్తున్నారంటూ రాష్ట్ర పాల ఏకిరిల చైర్మన్ నాగేశ్వరరావు నాయుడు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో కాణిపాకం ఈవో పెంచల కిషోర్ విచారణ అధికారిగా బోయకొండకు వచ్చి, తొలుత ఫిర్యాదు చేసిన నాగేశ్వరరావును, అనంతరం ఈవో ఏకాంబరంను విచారించారు.
అనంతరం కొండ కింద బాధితులు తమకు న్యాయం చేయాలని అధికారి కిషోర్ ను కోరారు#కొత్తూరుమురళి.
