కర్నూలు : కర్నూలు సిటీ : కర్నూలు జిల్లా…సంక్రాంతి పండగల వేళ….పందెంల జోలికెళ్లొద్దు…డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.* ఎవరైనా జూదం, పేకాట, కోడి పందెంలు, గుండాట తదితర అసాంఘిక కార్యకలపాలు నిర్వహిస్తే చర్యలు .
సంక్రాంతి పండగ నేపథ్యంలో పందెంల జోలికెళ్లొద్దని డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు ఆదివారం జిల్లా ప్రజలకు ఒక ప్రకటనలో సూచించారు. సంప్రదాయ క్రీడలు మాత్రమే ఆడాలని సూచించారు. పేకాట, జూదం, కోడి పందెంలు, గుండాట వంటి తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.జిల్లా
కేంద్రంతో పాటు పట్టణాలు, గ్రామాలు, శివారు ప్రాంతాల్లో కోడి పందెంలు, జూదాలు, ఇతర చట్టవ్యతిరేక ఆటలు పూర్తిగా నిషేధం అన్నారు. ఎవరైనా కోడి పందెంలు ఆడినా, ప్రోత్సహించినా, నిర్వహించినా చర్యలు తప్పవన్నారు. జిల్లాలో ఎక్కడైనా కోడిపందెంలు, పేకాట, జూదం,
గుండాట వంటి ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తుంటే డయల్ 112 కు గాని లేదా డయల్ 100 కు గాని, స్ధానిక పోలీసులకు గాని సమాచారం అందించాలని డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు తెలిపారు.
