లక్షెట్టిపేటలో చైనా మాంజా విక్రయాలు, వాడకంపై ఎస్ఐ గోపతి రమేష్ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లక్షెట్టిపేటలోని పలు పతంగి దుకాణాలను సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు.
మండలంతో పాటు గ్రామాల్లో చైనా మాంజాను ఎవరైనా విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని దుకాణదారులకు సూచించారు.
చైనా మాంజా వాడకంతో అనేక ప్రమాదాలు జరిగి, చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు.
