శ్రీరాంపూర్‌లో కుక్కల దాడి: నలుగురికి గాయాలు, ప్రజల్లో భయాందోళనలు
శ్రీరాంపూర్‌లోని అరుణక్కనగర్, మౌనిక కిరణం లైన్‌లో కుక్కల బెడద తీవ్రమైంది.
ఇప్పటివరకు నలుగురు వ్యక్తులు కుక్కల దాడిలో గాయపడ్డారు. దీంతో చిన్న పిల్లలు బయటకు రావడానికి భయపడుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
