బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల భద్రత, యువతలో అవగాహన మరియు నేర నియంత్రణే లక్ష్యంగా జిల్లాలోని శక్తి బృందాలు విస్తృత స్థాయిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
బాపట్ల: బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల భద్రత, యువతలో అవగాహన మరియు నేర నియంత్రణే లక్ష్యంగా జిల్లాలోని శక్తి బృందాలు విస్తృత స్థాయిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
ఈ కార్యక్రమాల్లో భాగంగా శక్తి యాప్ ఉపయోగాలు,
సైబర్ నేరాల నుంచి ఎలా జాగ్రత్తపడాలి,
మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు,
మహిళలకు సంబంధించిన చట్టాలు మరియు వారి హక్కులు
అనే అంశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లాలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు ఇతర రద్దీ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ, ముఖ్యంగా కళాశాల విద్యార్థులు, యువత మరియు మహిళలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా శక్తి బృందాల సభ్యులు మాట్లాడుతూ,
అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్‌ను ఎలా ఉపయోగించాలి,
సైబర్ మోసాలు, ఫేక్ లింకులు, ఆన్‌లైన్ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలి,
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు,
మహిళలకు రక్షణగా ఉన్న చట్టాలు, ఫిర్యాదు చేసే విధానం
వంటి అంశాలను వివరించారు.
ప్రజల భద్రతే లక్ష్యంగా బాపట్ల జిల్లా పోలీసులు ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.
#Narendra
