Home South Zone Telangana సంక్రాంతి పండగకు ఊరు వెళ్ళేదెలా?

సంక్రాంతి పండగకు ఊరు వెళ్ళేదెలా?

0

సంక్రాంతి పండగకు ఊరు వెళ్ళేదెలా?

పలు బస్టాండ్ లో ప్రయాణికుల అవస్థలు!
సంక్రాంతి పండుగ హడావు డి మొదలైంది ప్రధానంగా నగరాల నుంచి పల్లెలకు వెళ్లే జనం శుక్రవారం సాయంత్రం నుంచే క్యూ కట్టారు. దీంతో హైదరాబాద్ నగరం బిజీబిజీగా కనిపిస్తుంది శుక్రవారం రాత్రి నుంచి సొంతూరుకు పయనమవుతున్నారు. నగరవాసులు ప్రధానంగా ఏపీ, తెలంగాణలోని గ్రామాలకు వెళ్లే ప్రయాణికు లతో అటు రైల్వే స్టేషన్ల, ఇటు బస్టాండ్లు రద్దీగా మారాయి…

సంక్రాంతి పండగ పూట సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులతో పాటు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది, సంక్రాంతి పండుగ సంద ర్భంగా ప్రత్యేక బస్సులు నడపాల్సిన ఆర్‌టీసీ అధికారులు బస్సులు సమయానికి నడపక పోవడంతో శనివారం తెలంగాణ జిల్లాల్లోని కొన్ని బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి.

వచ్చిపోయే బస్సుల కోసం ప్రయాణికులు పరుగులు తీయడం, సీట్ల కోసం కుస్తీలు పడడం వంటి దృశ్యాలు కనిపించాయి. కాలేజీలకు, హాస్టళ్లకు, స్కూళ్లకు శనివారం నుంచి సెలవులు ప్రకటించడంతో ప్రయాణికుల రద్దీ పెరిగింది. మహాలక్ష్మి పథకం ప్రవేశ పెట్టిన నాటి నుంచి ఆయా రూట్లలో బస్సుల సంఖ్య తగ్గించడం వల్ల ప్రయాణీ కులు తిప్పలు పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.

ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్, ములుగు, మహబూబాద్, నిజామాబా ద్, అదిలాబాద్, వంటి రూట్లలో ప్రత్యేక బస్సులను నడిపేవారు. కానీ ఇప్పుడు అవి కానరావడం లేదు. మరోవైపు ఆర్డినరీ బస్సుల కు ఎక్స్‌ప్రెస్‌ బోర్డులు వేసి ప్రయాణికుల వద్ద నుంచి అత్యధిక చార్జీలను వసూలు చేస్తున్నారు. పల్లె వెలుగుతోపాటు ఆర్డినరీ బస్సులకు భూపాలపల్లి, కరీంనగర్‌, మంచిర్యాల వంటి రూట్లలో ఆర్డినరీ బస్సులకు ఎక్స్‌ప్రెస్‌ బోర్డు లు ఏర్పాటు చేయడం, ఆ బస్సులు కూడా సమయా నికి గమ్య స్థానాలకు చేరడం లేదు.

దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు సరిపడా రైళ్లు, ప్రత్యేక బస్సులు లేక ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలను ఆశ్రయించవలసివస్తుంది, సొంతూళ్ళకు ఎలా వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

NO COMMENTS

Exit mobile version