కూటమి పాలనలో పరుగులు పెడుతున్న అభివృద్థి, సంక్షేమం
–3వ డివిజన్‌లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్థి, సంక్షేమం పరుగులు పెడుతున్నాయని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు.
శనివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ సీతారామ నగర్ ఏరియాలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అక్కడి వారిని అడిగి తెల్సుకుని వాటిని పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో చతికిల పడిన రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్థి, సంక్షేమం పరుగులు పెడుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తనకున్న రాజకీయ అనుభవం, సమర్థత, పాలనా అనుభవంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్థి చేస్తూ ముందుకు తీసుకువెళుతున్నారన్నారు. ఒక వైపు రాష్ట్రాన్ని అభివృద్థి చేస్తూనే సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల అమలుకు తోడుగా విద్యుత్ ఛార్జీలు తగ్గింపు, జీఎస్టీలో సంస్కరణ వల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించి పేదలపై ఆర్థిక భారాలను తగ్గించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తాడి బాబూరావు, గద్దె రమేష్, పేరేపి ఈశ్వర్, బండి సాయి కోమలి, గుంజు ఏసు తదితరులు పాల్గొన్నారు.
