మెదక్ సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వొడ్డె వొబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాహుల్ రాజ్ వారు మాట్లాడుతూ పీడిత ప్రజలు ఆరాధ్య దైవం ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు వొడ్డె వొబన్న అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు.
వొడ్డె వొబన్న సామాజిక సమానత్వం శ్రమ విలువలు ఐక్యతకు ప్రతీకగా నిలిచారని తెలిపారు.సమాజంలోని పేద బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని యువత ఆయన ఆదర్శాలను అనుసరించి సమాజ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు.
చరిత్రను ఎంతో గొప్పదన్నారు అన్ని వర్గాల సంక్షేమ ప్రభుత్వ ధ్యేయంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని తెలిపారు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటునే ప్రథమ స్వాతంత్ర్య యుద్ధం అంటారని కానీ అంతకుముందే 1846లో తెలుగునాట ఉయ్యాలవాడ నరసింహరెడ్డితో కలిసి బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం వీరోచితంగా పోరాడారని కొనియాడారు. వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఓబన్న జయంతిని.
అధికారింగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.బీసీ ముద్దుబిడ్డ స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆ మహనీయుని వీరగాథను అందరు స్మరించుకోవాలని అన్నారు.
