Home South Zone Andhra Pradesh స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత మార్ధాన్ |

స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత మార్ధాన్ |

0

భారతీయ జనతా యువమోర్చా

స్వామి వివేకానంద స్ఫూర్తి తో యువత మారథాన్… రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా BJYM ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన 5 కిలోమీటర్ల మారథాన్ రన్ కార్యక్రమంలో ఈ రోజు ఉదయం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాయవాడ రాఘవయ్య పార్క్ వద్ద ఉన్న స్వామి వివేకానంద గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం, మారథాన్ రన్‌ను ప్రారంభించి కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

ఉల్లాసంగా

అందరికి స్ఫూర్తిగా ఉండాలన్న ఉద్దేశం తో తాను కూడా స్వయంగా పరిగెడుతూ సహచారులతో భాగస్వాములు అయ్యారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తెలుసుకుంటూ ఉల్లాసంగా పక్కనున్న వారిని చైతన్యపరిచారు. జాతీయ స్థాయి నాయకుడిగా ఉన్న శ్రీ సత్య కుమార్ తమతో పాటు వస్తుండడంతో పక్కన ఉన్న వారిలో జోష్ కనిపించింది
విజయవాడ రోడ్లపై ఆదివారం కనిపించిన ఈ దృశ్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

బహుమతుల పంపిణీ

మారథాన్ రన్ లో ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాల్లో వచ్చిన వారికి మంత్రి శ్రీ సత్య కుమార్ బహుమతులు అందజేసి వారిని అభినందించారు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువశక్తే నవభారత నిర్మాణానికి పునాది అని పేర్కొన్నారు. భారతదేశం నేడు ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుల జనాభా కలిగిన దేశమని, మన జనాభాలో సుమారు 65 శాతం మంది 35 ఏళ్లలోపు యువతేనని గుర్తు చేశారు. “నాకు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉన్న వందమంది యువకులను ఇవ్వండి, ఈ దేశ గతిని మార్చేస్తాను” అని స్వామి వివేకానంద నాడు ఇచ్చిన పిలుపు నేటికీ మార్గదర్శకమని తెలిపారు. ఆ యువశక్తినే నమ్ముకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నారని అన్నారు.

యువతలోని నైపుణ్యాన్ని గుర్తించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి వినూత్న పథకాలను అమలు చేస్తోందని మంత్రి వర్యులు వివరించారు. వీటి ఫలితంగా నేడు దేశవ్యాప్తంగా సుమారు లక్షన్నర స్టార్టప్‌లు ఏర్పడి, వాటిలో 25 నుంచి 30 యూనికార్న్ కంపెనీలు నిలిచాయంటే, అది భారత యువత ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు.

సాంకేతిక రంగంలో కూడా భారత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోందని పేర్కొంటూ, ఇతర దేశాలు చేయలేకపోయిన కార్యాన్ని భారత్ చేసి చూపిందని, చంద్రుని దక్షిణ ధృవంపై విజయవంతంగా అడుగుపెట్టిన ఘనత మన దేశానిదేనని అన్నారు. ఇది పూర్తిగా యువ శాస్త్రవేత్తల కృషి ఫలితమేనని, యువశక్తిపై పెట్టుబడి పెడితే దేశ భవిష్యత్తు ఎలా మారుతుందో దీనికి ఇదే స్పష్టమైన ఉదాహరణనని తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని 11వ స్థానం నుంచి 4వ స్థానానికి తీసుకురావడంలో యువత పాత్ర అమోఘమని మంత్రి వర్యులు పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించి, దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక శక్తిగా, విశ్వగురువుగా నిలబెట్టాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పమని స్పష్టం చేశారు.

“దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. వికసిత భారత్ నిర్మాణంలో ప్రతి యువకుడు భాగస్వామి కావాలి.”

ఈ మారథాన్ రన్ వంటి కార్యక్రమాలు యువతలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంటూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. స్వామి వివేకానంద గారి ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో యువత ముందుండాలని పిలుపునిచ్చారు.సత్యకుమార్
ఐపిఎల్ క్రీడాకారుడు కళ్యాణ్ కృష్ణ దొడ్డ పనేని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులు ను ప్రోత్సహిస్తున్నారన్నారు.ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిందన్నారు.
బిజెపి జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం,యువమోర్చా అధ్యక్షులు శివకృష్ణారెడ్డి,పిట్టల గోవిందు తూములూరి కృష్ణ చైతన్య, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాష, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్,అవ్వారు బుల్లబ్బాయి,పైలా సురేష్ ,నరసరాజు,కంచుపల్లి హరినారాయణ,గొట్టిముక్కల రమేష్ రాజు,ప్రవీన్ రాంక తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

Exit mobile version