అమరావతిపై విషం కక్కుతున్న వైకాపా*
టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్*
అమరావతిపై విషం కక్కడం వైకాపా నాయకుల రాజకీయ అలవాటుగా మారిందని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ విమర్శించారు. పారదర్శకంగా అమరావతి టెండర్లు జరుగుతుంటే అవినీతి జరిగిందంటూ బురద జల్లడంతోనే వైకాపా వారి కుట్ర రాజకీయాల అసలు ముఖచిత్రం బయట పడుతుందని అన్నారు.
ఆదివారం ఉదయం 14వ డివిజన్ పటమట చిన్న వంతెన ఏరియాలో గద్దె క్రాంతి కుమార్ పర్యటించి స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆటో కార్మికుడు పాతిరెడ్డి వెంకటరావుకు జీవనోపాధి కల్పించేందుకు ఆటో ఫైనాన్స్ నిమిత్తం రూ. 50 వేల ఆర్థిక సహాయం సొంత నిధులు నుంచి అందజేశారు.
ఈ సందర్బంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ తమ దృష్టిలో అమరావతే ఒక్కటే రాజధాని అని గద్దె క్రాంతి కుమార్ స్పష్టం చేశారు. గత వైకాపా ప్రభుత్వ నిర్వాహణ అజ్ఞానం, నిర్లక్ష్యం వల్లే అమరావతి పనులు ఐదేళ్లపాటు నిలిచిపోయాయని అన్నారు. రాజధానిని కూల్చి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే వైకాపా అమరావతిపై కుట్రలు చేసిందని ఆరోపించారు.
ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు గుంటూరు–విజయవాడ మధ్యలో రాజధాని అంటూ మాయమాటలు చెబుతున్నారని, అమరావతి ఉన్నదే గుంటూరు–విజయవాడ మధ్యన అనే అవగాహన కూడా వైకాపా నాయకులకు లేదన్నారు. అమరావతి రైతుల కన్నీళ్లు, ప్రజల శాపనార్థాలే వైకాపా పతనానికి కారణమని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి పునర్నిర్మాణానికి వేగం వచ్చిందని, వైకాపా నేతలు ఆ భయంతోనే అభాండాలు వేస్తున్నారని అన్నారు. అభివృద్ధి జరిగితే తమ రాజకీయాలు నిలవవన్న భయంతోనే వైకాపా నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఇక మాటలకే పరిమితమయ్యే వైకాపాకు భిన్నంగా, కూటమి ప్రభుత్వం చేతలతో పాలన చేస్తోంది అని తెలిపారు.
గత ప్రభుత్వం ఆటో కార్మికులను పట్టించుకో లేదని ఒక చేత్తో పదివేలు ఇచ్చిన మరో చేత్తో పెద్ద ఎత్తున కేసులు రాసి వారికీ ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకుందన్నారు. కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు అండగా నిలుస్తూ వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేసే సంక్షేమ పథకాలు, ప్రమాద బీమా, కుటుంబ భద్రత కల్పించే పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ప్రజలను మోసం చేయడంలోనే వైకాపా రాజకీయాలు పరిమితమైతే, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. అమరావతిని కాపాడేది కూటమి ప్రభుత్వమేనని, వైకాపా అబద్ధాలను ప్రజలు ఇప్పటికే నమ్మడం మానేశారని గద్దె క్రాంతి కుమార్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కర్నా రమేష్, నర్రా కిషోర్, గరికిపాటి శ్రీనివాస్ (బద్రి), ఫాతిమా, రేపాకుల రాఘవ ప్రసాద్, కర్నా కోటేశ్వరరావు, కేల్ల రమేష్ నాయుడు, నాసర్ వలి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
