పుంగనూరు నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం, పిల్లలు, వృద్ధులు.
మధ్య వయస్కులు చలిని తట్టుకోవడానికి చలిమంటలు వేసుకున్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో చలి మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వైద్యులు ప్రజలను అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు# కొత్తూరు మురళి.
