మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్క్ లో వున్ హాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోతుల ఆహార సేకరణ కేంద్ర నీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న అర్బన్ పార్క్ సమీపంలో కోతుల
ఆహార పదార్థాల కేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయమని అదే విధంగా పర్యటకులు ఇట్టి విషయాన్ని గమనించి దారి వెంబడి ఆహార పదార్థాలు వేయకుండా ఏర్పాటుచేసిన కేంద్రంలో ఇచ్చినట్లయితే కోతులు ప్రజా వద్దకు రాకుండా అదేవిధంగా రోడ్డుపై వాహనాల కింద పడకుండా ఉంటాయని వారు వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.




