మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రజా పాలనలో మహిళలకు పెద్దపీట వేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వరులు చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం కాంగ్రెస్ నాయకులు ఓబీసీ జాతీయ అధ్యక్షులు గుడ ఐలయ్య గౌడ్ a జగద్గిరిగుట్ట మగ్దుమ్ నగర్ లో సంక్రాంతి ముగ్గుల పోటీలు రంగోలి ఉత్సవాలు ప్రగతి మహిళా సమైక్య అధ్యక్షురాలు మాజీ కౌన్సిలర్ గూడ వరమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐఎన్టియుసి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రీయ ఓబీసీ అధ్యక్షులు గూడ ఐలయ్య గౌడ్ నేషనల్ దళిత సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బుధాల అమర్ బాబు మాట్లాడుతూ… ప్రపంచంలోనే భారత దేశ సంస్కృతి చాలా గొప్పదని మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలు అన్ని రంగాలలో రాణించాలని లక్ష్యంతో మహిళలు కోటీశ్వరులు కావాలని ఆశయ సాధన తో పని చేస్తున్నారని మహిళలకు ఫ్రీ బస్సు సన్న బియ్యము వడ్డీ లేని రుణాలు పెట్రోల్ బంకులు ఆర్టీసీ బస్సులు ఇప్పిచ్చి మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కి అభినందనలు.
గత 40 సంవత్సరాల నుండి మద్దుమ్ నగర్ జగదిరిగుట్టలో ప్రగతి మహిళా సమైక్య ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ నాయకురాలు జగదిరిగుట్ట కాంగ్రెస్ కాంటెస్ట్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మాజీ కౌన్సిలర్ గూడవరమ్మ అన్నారు. మహిళలు ఉత్సవంగా రంగోలి ముగ్గుల పోటీలు పాల్గొని విజయవంతం చేసిన మహిళలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేశారు కార్యక్రమంలో జగద్గిరిగుట్ట విద్యు ఉప కేంద్రం ఏ ఈ రాధాకృష్ణారెడ్డి పాల్గొని గృహ జ్యోతి విద్యుత్తు మహిళలు ఉపయోగించుకోవాలని విద్యుత్ పరికరాలు జాగ్రత్త వాడుకోవాలని అన్నారు మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి మహిళల రక్షణ కోసం కవచాలుగాపోలీసులు నిలబడుతారు.
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ బి వెంకటేష్ జగద్గిరిగుట్ట రంగోలి రంగోలి ముగ్గుల పోటీలో ముఖ్యఅతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశం మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం పోలీసులు కవచంగా నిలబడతారని అండగా ఉంటారని అన్నారు. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చినవాళ్లు గ్రామాలకు వెళ్లేటప్పుడు విలువైన వస్తువులు ఇంట్లో పెట్టకుండా జాగ్రత్త పడాలని ప్రయాణం చేసేటప్పుడు బంగారు ఆభర ణాలు డబ్బులు వస్తువులు చిన్నపిల్లలను జాగ్రత్త పెట్టుకోవాలని దొంగల బారిన పడవద్దని వారికి తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి ఏ భాగ్యలక్ష్మి ద్వితీయ బహుమతి వినోద తృతీయ బహుమతి దీప కు నగదు బహుమతులు చీర మెమొంటో అందజేశారు.
ఈ కార్యక్రమంలో జగదిరిగుట్ట ఎస్సై డి శ్రీవాణి, మహిళా నాయకురాలు జై మంగా, పి సత్యలక్ష్మి, సులోచన, గడ్డమీది కలమ్మ, లక్ష్మీ తిరుపతమ్మ, రేవంత్ రెడ్డి యువసేన సాయి ప్రవీణ్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు శ్రవణ్ బండి యాదగిరి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Sidhumaroju




