మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో, 25 మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు స్వీకరించారు.
సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. మొత్తం 266 అర్జీలు స్వీకరించబడ్డాయి. అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించి, ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ నిర్ణీత గడువులోగా ప్రతి సమస్యను పరిష్కరించాలని డిఆర్ఓ అధికారులను ఆదేశించారు.
