Home South Zone Andhra Pradesh ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుతో సహా 37 మందికి విముక్తి

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుతో సహా 37 మందికి విముక్తి

0

ముఖ్యమంత్రి చంద్రబాబు నిందితుడిగా ఉన్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 37 మందికి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

చంద్రబాబుతోపాటు మిగిలిన నిందితులపై ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సీఐడీ నివేదిక సమర్పించడంతో విచారణను మూసివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.

వైసీపీ అధికారంలో ఉండగా నమోదైన ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఆ టైంలో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

NO COMMENTS

Exit mobile version