Home South Zone Telangana మెదక్ ప్రజలకు బోగి–మకర సంక్రాంతి శుభాకాంక్షలు |

మెదక్ ప్రజలకు బోగి–మకర సంక్రాంతి శుభాకాంక్షలు |

0

మెదక్ జిల్లా కలెక్టర్ హిందువులు జరుపుకునే పండుగల్లో అతి పెద్ద పండగ సంక్రాంతి అని ఈ పండగ ను,మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమగా మూడు రోజులు జరుపుకుంటారని తెలిపారు.పేద,ధనిక తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు పండుగ ను సంతోషంగా జరుపు కోవాలని ఆకాంక్షించారు.

అందరి భాగస్వామ్యంతో అభివృద్ధిలో జిల్లా ముందుడుగు వేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ అభిలషించారు.ప్రతి కుటుంబం భోగి భాగ్యాలతో వెలుగొందాలని,భోగి మంటలు, వెచ్చటి వెలుగులు, పరి పూర్ణ మైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, మకర సంక్రాంతి కాంతులతో ప్రతి ఇల్లు సంక్షేమ.

సౌభాగ్యాలతో శోభాయమానంగా వెలుగొందాలని కనుమ కాంతులతో పల్లె సీమలు, పశు సంవద, వ్యవసాయ,ఉద్యాన పంటలతో సుభిక్షంగా కళకళలాడాలని ఆకాంక్షిస్తూ జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

NO COMMENTS

Exit mobile version