AP: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో మరో అప్లికేషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణ కొనసాగింపుపై ట్రయల్ కోర్టు పాక్షికంగా అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆమె ఈ దరఖాస్తు చేశారు.
పూర్తి స్థాయిలో విచారణ కొనసాగాల్సిన అవసరం ఉందని సునీత తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ధర్మాసనం, సునీత దాఖలు చేసిన అప్లికేషన్ను, పెండింగ్ పిటిషన్లపై విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
