Home South Zone Telangana ఒక చిన్న నిర్లక్ష్యం కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది… జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు.

ఒక చిన్న నిర్లక్ష్యం కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది… జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు.

0

మెదక్ జిల్లా కూల్చారం మండలం లోని దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా అరైవ్ అలైవ్ అనే వినూతన అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధులలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు.

జనవరి 13 నుండి 24 వరకు నిర్వహించనున్న ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజు కూల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతనశెట్టిపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఐపీఎస్ పాల్గొనరు. హెల్మెట్ ధరించడం ప్రాణాలకు రక్షణ కవచంలాంటిదని అందువల్ల ప్రతి ద్విచక్ర వాహనదారుడు.

తప్పనిసరిగా హెల్మెట్ ధరించడంతో పాటు, ఫోర్ వీలర్ వాహనదారులు సీటు బెల్టు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అతివేగం, నిర్లక్ష్యం,మద్యం సేవించి వాహనాలు నడపడం,హెల్మెట్ మరియు సీటు బెల్టు వినియోగించకపోవడం వంటి కారణాల వల్ల జరుగుతున్నాయని తెలిపారు. “Arrive Alive” కార్యక్రమం ద్వారా ప్రతి వ్యక్తిలో బాధ్యతాయుతమైన వాహన వినియోగంపై అవగాహన పెంపొందించి ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

NO COMMENTS

Exit mobile version