Wednesday, January 14, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఅంగరంగ వైభవంగా జరిగిన ముగ్గుల పోటీలు |

అంగరంగ వైభవంగా జరిగిన ముగ్గుల పోటీలు |

తెలుగు సంప్ర‌దాయాల‌ను కొన‌సాగించాలి..
ముగ్గుల పోటీల బ‌హుమ‌తి ప్ర‌ధానంలో ఎమ్మ‌ల్యే సుజ‌నా చౌద‌రి..

విజ‌య‌వాడ న‌గ‌ర జ‌న‌సేన నేత బాడిత శంక‌ర్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల విజేత‌ల‌కు ప‌శ్చిమ ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి బ‌హుమ‌తులు అంద‌చేశారు. సంక్రాంతి సంబ‌రాల్లో భాగంగా భ‌వానీపురం పున్న‌మి ఘాట్ లో మ‌హిళ‌ల‌కు ముగ్గుల పోటీలు నిర్వ‌హించారు. మ‌హిళ‌లు ఈ పోటీల్లో పాల్గొని వివిధ రకాల వైవిధ్య‌మైన ముగ్గులు వేశారు. పోటీల‌లో విజేత‌ల‌కు ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి బ‌హుమ‌తి ప్ర‌ధానం చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మ‌ల్యే సుజ‌నా చౌద‌రి మాట్లాడుతూ ఈ సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల‌దరికీ భగవంతుడి ఆశీస్సులు ఇవ్వాలని కోరారు. ముగ్గుల కార్యక్రమం మన తెలుగు ప్ర‌జల సంప్రదాయం కాబ‌ట్టి నేటి త‌రం వారికి మ‌న సంస్క్ర‌తి , సంప్ర‌దాయాలు తెలియ‌చేయాల్సిన ఆవ‌స్య‌క‌త ఉంద‌నన్నారు. .

భార‌త‌ దేశంలో వివిధ ప్రాంతాలో పేర్లు మారినా పెద్ద పండుగ మాత్రం సంక్రాతి యేన‌న్నారు. పంట‌లు చేతికొచ్చి రైత‌లు ప‌ల్లెల్లో పండుగ‌ ఉత్సాహంతో చేసుకుంటారు .. అదే విధంగా న‌గ‌రాల్లో సైతం పండుగ ను గుర్గు చేసే ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం సంతోషంగా ఉందన్నారు. భావి తరాలకు కూడా పండుగ శోభ తెలియచేయాలంటు ఇటువంటి పోటీలు తోడ్ప‌డ‌తాయ‌న్నారు.

పోటీల నిర్వాహ‌కుడు జ‌న‌సేన నేత బాడిత శంక‌ర్ మాట్లాడుతూ తాను గ‌త 40 ఏళ్ల‌లో సుజ‌నా చౌద‌రి వంటి ఉత్త‌మ విలువ‌లు క‌ల్గిన ఎమ్మ‌ల్యేను చూడ‌లేద‌న్నారు. అవినీతి లేకుండా , క‌మిష‌న్లు వ‌సూలు చేయ‌ని ఎమ్మ‌ల్మె గా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల గుండెల్లో చిర స్థాయిలో సుజ‌నా చౌద‌రి నిలుస్తార‌ని కొనియాడారు. కార్య‌క్ర‌మంలో కూట‌మి కార్పొరేట‌ర్లు రాజేష్, అప్పాజీ, జ‌న‌సేన వీర మ‌హిళ‌లు రావి సౌజ‌న్య‌, బీజేపీ నాయ‌కులు అడ్డూరి శ్రీరామ్, స్తానిక నాయ‌కులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments