మదనపల్లి రూరల్ సర్కిల్ పరిధిలోని కురబలకోట, నిమ్మనపల్లి, రామసముద్రం మండలాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందెం, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రవి నాయక్ హెచ్చరించారు.
మంగళవారం ముదివేడు ఎస్సై మధురాం చంద్రు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ మాట్లాడుతూ, పల్లెల్లో సంప్రదాయాల పేరుతో జూదం, కోడిపందెం నిర్వహించడాన్ని పోలీసులు ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.
ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
