రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్లు 107, 108, 590ను తక్షణమే ఉపసంహరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.
బుధవారం ఉదయం మదనపల్లి సీపీఐ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జీవో పత్రాలను భోగిమంటల్లో దగ్ధం చేశారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప మాట్లాడుతూ.
పీపీపీ విధానం వల్ల పేదలకు వైద్య విద్య, వైద్యం దూరమవుతుందని విమర్శించారు. ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలమైందని ఆయన అన్నారు.
