అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎర్రాతి వారి పల్లె బుధవారం సాయంత్రం జనసంద్రంగా మారింది.
మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయ్యప్ప స్వామికి తిరు ఆభరణాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప శరణు ఘోషల మధ్య భక్తులు జ్యోతి దర్శనం చేసుకున్నారు# కొత్తూరు మురళి.
