Home South Zone Telangana సమ్మక్క, సారలమ్మ జాతరలో తొలి ఘట్టం మొదలైం |

సమ్మక్క, సారలమ్మ జాతరలో తొలి ఘట్టం మొదలైం |

0

జాతరకు 15 రోజుల ముందు నిర్వహించే అత్యంత సంప్రదాయబద్ధమైన ‘గుడిమెలిగే’ (గుడి శుద్ధి) పండుగను ఈరోజు పూజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకతో మేడారం మహా జాతర తొలి ఘట్టం అధికారికంగా ప్రారంభమైంది. తెల్లవారుజామునే *మేడారంలోని సమ్మక్క ఆలయంలో సిద్ధబోయిన.

కొక్కెర వంశీయులు ప్రత్యేక పూజలు* నిర్వహించారు. అలాగే *కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో కాక వంశీయులైన పూజారులు ప్రత్యేక పూజలు* చేశారు. వనదేవతల ఆలయాలను పవిత్ర జలంతో శుద్ధి చేశారు. గుడి శుద్ధి అనంతరం ఆడపడుచులు అడవి నుంచి సేకరించిన పవిత్రమైన పుట్టమన్నుతో ఆలయ ప్రాంగణాలను పూజారులు అలికారు. రంగురంగుల ముగ్గులతో అలం కరించారు.

ఆదివాసీల ఆచారాల ప్రకారం.. ఈ ‘గుడిమెలిగే’ కార్యక్రమం పూర్తయినప్పటి నుంచే మేడారం ప్రాంతంలో పండుగ వాతావరణం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంతో జాతర పనులు వేగవంతం అవుతాయి. 15 రోజుల తర్వాత జరిగే మహాజాతర కోసం ఇప్పటికే భక్తులు మేడారానికి పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చేభక్తుల కోసం ప్రభుత్వం, ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

NO COMMENTS

Exit mobile version