మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లాలు తండా శివారులో ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనం పై వస్తూ చెట్టుకు డీ కొని స్పాట్ లో ఒక వ్యక్తి దుర్మరణం ఒకే వాహనం పై షరీఫ్ నుండి కోడి కందురూ చేసుకొని కుటుంబ సమేతంగా తమ తల్లిదండ్రులు ఆటోల వెళ్లిపోగా మిగతా ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై వస్తున్న సందర్భంలో లాలు తండా శివారు లో మూలమలుపు దగ్గర ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీ కొని అక్కడీకక్కడే
శివ అనే యువకుడు 23 సంవత్సరాల మరణించడం జరిగింది. మహేష్ అనే వ్యక్తి ప్రాణప్రయస్థితిలో కొట్టుమిట్టాడం జరుగుతుంది. నాంపల్లి అజయ్ అనే వ్యక్తి ఇతను కూడా పరిస్థితి విషమంగా ఉంది. వీరు ముగ్గురు ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన వారుగా గుర్తించడం జరిగింది. అటువైపు వెళుతున్నటువంటి వాహనదారులు 108 కు సమాచారము ఇవ్వగా అక్కడికి తక్షణమే పోలీసు యంత్రంగా చేరుకొని కేసు నమోదు చేసుకొని వైద్య నిమిత్తం 108 లో మహబూబాబాద్ ప్రభుత్వ దావకానకు తరలించడం జరిగింది.
