మందమర్రిలో డివైడర్‌ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం
మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట సమీపంలో శుక్రవారం ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
స్థానికులు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.