Home South Zone Andhra Pradesh తాగునీటి ఎద్దడీ ఏర్పడకుండా గా ముందస్తు చర్యలు : మునిసిపల్ కమిషనర్

తాగునీటి ఎద్దడీ ఏర్పడకుండా గా ముందస్తు చర్యలు : మునిసిపల్ కమిషనర్

0

కర్నూలు :
తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు చర్యలు• నగరపాలక సంస్థ అధికారి పి.విశ్వనాథ్నగరంలో రానున్న వేసవి కాలంలో ఎలాంటి తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ అధికారి పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు.

శనివారం ఆయన అశోక్‌నగర్‌లోని నీటి శుద్ధి కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.నీటి శుద్ధి ప్రక్రియలో ఉపయోగించే ఫెర్రిస్ ఆలమ్, లిక్విడ్ క్లోరిన్ గ్యాస్ సిలిండర్ల వినియోగంపై పూర్తి స్థాయి జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. శుద్ధి కేంద్రంలోని ఎలక్ట్రికల్ మీటర్లు, స్క్రాబ్ యూనిట్‌ను పరిశీలించి, భద్రతా పరంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. స్టాక్ నిల్వ పట్టికలు, సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించి.

ఎటువంటి లోపాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగర తాగునీటి సరఫరా వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేశారు. లీకేజీలు, సరఫరా సమయం అంశాలపై పూర్తి స్థాయి పర్యవేక్షణ పెట్టాలని సూచించారు.సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో 0.15 టీఎంసీ, సుంకేసుల ప్రాజెక్టులో 1.2 టీఎంసీ నీటి నిల్వలపై ఎప్పటికప్పుడు జలవనరుల శాఖతో సమన్వయంతో ఉండాలని తెలిపారు.

గాజులదిన్నె ప్రాజెక్టులో 1 టీఎంసీ నీటిని నిల్వ చేసుకునేలా జలవనరుల శాఖ అధికారులతో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ఎస్‌ఈ రమణమూర్తి, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈఈ గిరిరాజ్, ఏఈ జనార్ధన్, ఇంచార్జి కేశవ్, మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version