కర్నూలు జిల్లా : కర్నూలు కర్నూల్ APS RTC బస్సు స్టేషన్ లో చోరీ కి పాల్పడిన మహారాష్ట్ర కి చెందిన ఇద్దరు మహిళా దొంగల అరెస్ట్, రిమాండ్ కి పంపినట్లు 4 వ పట్టణ సీఐ విక్రమసింహ ఒక ప్రకటన లో తెలియజేశారునవంబర్ 30 వ తేదీనకర్నూల్ APSRTC బస్టాండ్ లో కోయిలకుంట్ల కు చెందిన శారదా అనే మహిళ తన భర్త తో కలిసి హైదరాబాద్ నుండి కర్నూల్ కి వచ్చి, కోయిలకుంట్లకి వెళ్ళడానికి బస్సు కోసం వేచి ఉండగా, ప్రయాణీకుల లాగా ఇద్దరు మహిళలు బురఖాలు ధరించి ఫిర్యాది బస్సు ఎక్కుతున్న సమయం లో ఆ ఇద్దరు మహిళలు ఆమెను సమీపించి అందులో ఒకరు ప్రయణీకులను బస్సు ఎక్కకుండా foot board మీద నిలబడి కాసేపు అక్కడే నిల్చొనగా, మరో మహిళ ఫిర్యాది బాగ్ నందు ఉంచిన wallet ను.
అందులోని 9 తులాల బంగారు నగలను చాకచక్యంగా దొంగలించుకొని ఇద్దరు అక్కడినుండి నుండి పరారు అయ్యారు…సదరు శారదా గారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు పరచుకొని, అందుబాటులో ఉన్న CCTV ఫుటేజ్ ల ఆధారంగా సదరు మహిళలు ఎవరనే విషయంగా తమిళనాడు, కర్ణాటక, విజయవాడ, విశాఖపట్నం లకు సిబ్బంది ని పంపి విచారించడం జరిగింది… అయితే వారి గురించి సరైన ఆచూకి లభించలేదు..
.సంక్రాంతి సందర్బంగా ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దొంగతనాలు నిరోధించడానికి నాల్గవ పట్టణ స్టాఫ్ ని కొందరిని మఫ్టీ లో ఉంచడం జరిగింది…మొన్నటి రోజున ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా బస్సు స్టాండ్ నందు తిరుగుతుండగా నాల్గవ పట్టణ సిబ్బంది సుబ్బారాయుడు, ఈశ్వర్, మురళీధర్ మరియు జీనస్ లు వారిని మహిళా పోలీసుల సహాయంతో పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చి, హాజరు పరచగా, విచారణలో భాగంగా వారు 1) రోజీ సుల్తానా తండ్రి పేరు షేక్ మహబూబ్, వయస్సు : 45 సం2)షేక్ రఫీకా, తండ్రి పేరు:
ముత్తూస్ వయస్సు 65వీరి ఇద్దరిదీ అకోల జిల్లా కేంద్రం, మహారాష్ట్ర గా గుర్తించడం జరిగింది..అకోలా పోలీస్ వారితో విచారించుకొగా వీరు పడువు వృత్తి చేస్తూ, అప్పుడప్పుడు ఇలాంటి దొంగతనాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది…గత సంవత్సరం జనవరి నెలలో వీరి పై మహారాష్ట్ర లోని ఔరాంగాబాద్ లోనూ బాగ్ లిఫ్టింగ్ దొంగతనం కేసులు నమోదు అయ్యాయి…అంతేగాక నవంబర్ 30 వ తేదీన 9 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసినది కూడా వీళ్ళే అని గుర్తించడమైనది.
చోరీ సొత్తు గురించి విచారించగా హైదరాబాద్ లోని చార్మినార్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కి విక్రయించినట్టుగా తెలియ వచ్చింది…సదరు చోరీ సొత్తు రికవరీ గురించి ఒక SI సహా సిబ్బందిని హైదరాబాద్ కి పమొయించడం జరిగింది…ఈరోజున సదరు మహిళలను అరెస్ట్ చేసి గౌరవ మేజిస్ట్రేట్ వారి ముంది హాజరు పరచగా వారిని రిమాండ్ కి ఆదేశించాగా వారిని కర్నూల్ సబ్ జైలు కి తరలించడమైనది….
