ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ.*
యోగివేమన జయంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్న నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి.ఎస్.గారు.*
*ఈ రోజు నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు వారి కార్యాలయంలో యోగివేమన గారి చిత్రపటానికి పూలమాలవేసి వారు చేసిన సేవలను స్మరించుకోవడం జరిగింది.*
*ఈ కార్యక్రమంలో డి.సి.పి.లు శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐ.పి.ఎస్.గారు, శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.గారు, సి. పి. ఓ అధికారులు, పోలీస్ అధికారులు, సి.పి.ఓ. సిబ్బంది తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.*
*యోగివేమన తెలుగు సాహితీ, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహనీయుడని పేర్కొన్నారు.*
*ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో పద్యాలు రాసి ప్రజలను మెప్పించిన మహాకవి అని తెలిపారు. వేమన పద్యాలు వినని, తెలియని వారు లేరనడంలో అతిశయోక్తి లేదన్నారు.*
*యోగివేమన జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించడం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.*
