వేమన పద్యాలు సమాజానికి నైతిక విలువలను అందించాయి*
యోగి వేమన పద్యాలు సమాజానికి నైతిక విలువలను అందించాయని విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ మరియు అదనపు కమిషనర్ జనరల్ ఏ. రవీంద్ర రావు అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద యోగివేమన జయంతి పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగివేమన పద్యాలు సమాజానికి నైతిక విలువలను అందించాయని, వాటిని చిన్నప్పటి నుంచే అభ్యసించడం వల్ల వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని అన్నారు. సామాజిక సమానత్వం, మానవతా విలువలు, నిజాయితీ, కష్టపడి జీవించడం వంటి అంశాలను యోగివేమన తన పద్యాల రూపంలో తెలిపారని, ఇటువంటి విషయాలని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె.అర్జునరావు, చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ (ఇంచార్జ్) పి.సత్యకుమారి, పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) చంద్రశేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ ఏ.శ్రీధర్, అకౌంట్స్ ఆఫీసర్ బి. సత్యనారాయణ మూర్తి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి.సోమశేఖర్ రెడ్డి, బయాలజిస్ట్ కామేశ్వరరావు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.
