ఎంపీ క్యాంప్ కార్యాలయం లో ఎన్టీఆర్ కి ఘన నివాళి
పేదలకు పండ్లు పంపిణీ చేసిన టిడిపి నాయకులు
విజయవాడ: పశ్చిమ నియోజకవర్గం గణపతి రావు రోడ్ లో గల తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఎంపీ కేశినేని శివనాథ్ క్యాంపు కార్యాలయం నందు ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమం ఆదివారం జరిగింది..
ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల కమిటీ నాయకులు, సభ్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పేదలకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది.




