నర్సాపూర్ మున్సిపాలిటీ పట్టణంలో 02 వ అలాగే 12వ వార్డులో ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి నర్సాపూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 12 హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ చేసిన మోసాలను స్థానికులకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.
మహిళలకు రూ.2500, వికలాంగులకు రూ.6000 పెన్షన్, స్కూటీలు ఇవ్వకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తల పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
