తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు, విశ్వ విఖ్యాత నటసార భౌమ,అన్న స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 30వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి మాజీ ఉడా చైర్మన్ తుమాటి ప్రేమానాద్, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి గన్నే ప్రసాద్ లు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
తుమాటి ప్రేమానాద్,లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్,గన్నే ప్రసాద్ లుమాట్లాడుతూ తెలుగు తేజాన్ని తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలల వ్యాపింప చేసిన మహా మనిషి, ఆంధ్రప్రదేశ్లో సరికొత్త రాజకీయ చైతన్యానికి తెరలేపిన ఘనత నందమూరి తారకరామారావు గారిదేనని కొనియాడారు. అన్న నందమూరి తారక రామారావు గారి ప్రవేశపెట్టిన కిలో రెండు రూపాయలకే బియ్యం, ఆస్తిలో మహిళలకు సమానహక్కు,
పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు, కార్మికులకు పక్కా గృహాలు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేరని, పథకాల రూపంలో వారి మదిలో అన్న ఎన్టీఆర్ గారు చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. తెలుగు దేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టి రికార్డ్ సృష్టించిన మహ నాయకుడు నందమూరి తారక రామారావు గారని,ఎన్టీఆర్ గారు తెలుగువారి ఆత్మగౌరవం కాపాడడం కోసం, బడుగు బలహీన వర్గాల జీవన విధానం మెరుగుపరచడం కోసం తెలుగుదేశం
పార్టీని స్థాపించారని, అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల వారు రాజకీయంగా ఎదగడానికి ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు కల్పించారని తెలిపారు. అన్న నందమూరి తారక రామారావు గారు సినీ పరిశ్రమలో, రాజకీయ రంగంలో మకుటం లేని మహారాజుల తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అన్నారు.
అటు వంటి మహా నాయకుడు అడుగుజాడల్లో ఈనాడు నారా చంద్రబాబునాయుడు గారు పార్టీని, కార్యకర్తలని కాపాడుకుంటూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన వెనకడుగు వేయకుండా పార్టీని ముందుకు నడిపించడంలో చంద్రబాబు గారు ఆయనకు ఆయనే సాటి అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, చెన్నుపాటి ఉషారాణి,రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నూతులపాటి నాగభూషణం, పామర్తి కిషోర్ బాబు, వడపట్ల గోపాలకృష్ణ (నాని),కోనేరు రాజేష్ ,బత్తుల దుర్గారావు,కొనసాని నాగమణి,బోయిన సుబ్రహ్మణ్యం, కోడూరు ఆంజనేయ వాసు, గొల్లపూడి నాగేశ్వరరావు, దేవరపల్లి ఆంజనేయులు, వాకా వెంకటేశ్వరావు గౌడ్, జాస్తి సురేష్,కొర్రపాటి సురేంద్ర, వీరపనేని అరుణ ,భవాని, లక్ష్మీ ,ఈడ్పుగంటి అజయ్, సజ్జ రవి,గుమ్మడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
