పుంగనూరు మండలం, చదళ్ళ గ్రామంలో ఆదివారం కరుణాకర్ అనే రైతుకు చెందిన వరిగడ్డి వామికి అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుందని, దీనికి గల కారణాలను విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి కొత్తూరు మురళి.
