Home South Zone Andhra Pradesh యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : టీజీ వెంకటేష్

యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : టీజీ వెంకటేష్

0

కర్నూలు : కర్నూలు సిటీ :

యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం-మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్క్రీడల అభివృద్ధికి కృషి చేస్తూ యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు.స్థానిక ఎస్టిబిసి కళాశాల మైదానంలో  టిజిబి, లక్కీ టు వెంకటేశ్వర్లు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో క్రీడలు అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టమన్నారు.  క్రికెట్ పోటీలలో  80 జట్లు పాల్గొనడం విశేషం అన్నారు.

యువతను క్రీడల్లో ప్రోత్సహించడమే ధ్యేయంగా టీజీబి,లక్కీ టు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి, తన తనయుడు టీజీ భరత్ పేరు మీద మొదటి బహుమతిగా లక్ష రూపాయలు, రెండవ బహుమతిగా 50వేల రూపాయలను నిర్వాహకులు ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత క్రీడల్లో పాల్గొనడం వల్ల చెడు అలవాట్లకు దూరంగా క్రమశిక్షణ గల పౌరులుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి వారు ఎంచుకున్న రంగాలలో మరింత రాణించేందుకు అవకాశం ఉంటుందని టీజీ తెలిపారు. అలాగే క్రీడల్లో పాల్గొని గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకునే శక్తి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వాహకుడు లక్కీ టు గోపి తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version