Home South Zone Andhra Pradesh పశు ఆరోగ్య శిబిరాల గోడపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోట్ల !!

పశు ఆరోగ్య శిబిరాల గోడపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోట్ల !!

0

కర్నూలు : నంద్యాల : డోన్:
ఈ రోజు డోన్ పట్టణంలో ఎమ్మెల్యే గారి నివాసంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాల గోడపత్రికను గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు ఆవిష్కరించారు.    ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ

రైతులు మరియు పశుపాలకుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పశువుల ఆరోగ్యం మెరుగుపడితే రైతుల ఆర్థిక స్థితి బలపడుతుందని తెలిపారు. ఈ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు 19-01-2026 నుండి 30-01-2026 వరకు నిర్వహించబడతాయని, పశుపాలకులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గారు

కోరారు.ఈ శిబిరాల ద్వారా పశువులకు ఉచిత వైద్య చికిత్సలు, గర్భకోశ సంబంధిత వ్యాధులకు ప్రత్యేక చికిత్సలు, అలాగే వివిధ నివారణ మందుల పంపిణీ నిర్వహించబడుతుందని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతంలోని పశుసంపద ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

NO COMMENTS

Exit mobile version