Home South Zone Andhra Pradesh మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

0

మార్కాపురం జిల్లా
పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి
పెద్ద దోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామ సచివాలయం ఎదురుగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన మినీ వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో భ్రమరాంబ చెంచు కాలనీకి చెందిన దాసరి అంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు.

అంకన్న పెద్ద దోర్నాలలో పనులు ముగించుకుని తన నివాసమైన బి.ఎం.సి కాలనీకి తిరుగు ప్రయాణం అవుతుండగా, మార్గమధ్యలో చిన్న గుడిపాడు వద్ద ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

NO COMMENTS

Exit mobile version