మదనపల్లెలో స్కూల్ అనుమతి కోసం రూ. 45 వేల లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని సోమవారం కడప ఏసీబీ డీఎస్పీ సీతారామారావు తెలిపారు.
గుర్రంకొండ ఏబీసీ స్కూల్ కరస్పాండెంట్ శేషాద్రి నాయుడు డీవైఈవో కార్యాలయంలో దరఖాస్తు చేయగా, ఫైల్ పాస్ చేయడానికి జిల్లా విద్యాశాఖ సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ బాష అలియాస్ మున్నా, అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ లంచం డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటుండగా వారిని పట్టుకున్నట్లు తెలిపారు.
