మదనపల్లె సీటీఎం రోడ్డులోని రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టి, రసాయనాలు కలిపి రంగు మార్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
భారీగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు, యజమానులపై కఠిన చర్యలకు ఆదేశించారు. పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే సహించేది లేదని ఎస్పీ కరీముల్లా షరీఫ్ హెచ్చరించారు. ఈ దాడులతో అక్రమ వ్యాపారుల్లో వణుకు మొదలైంది.
